కర్ణాటక రాజధాని అయినటువంటి బెంగళూరు లో నిన్న రాత్రి బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో ఓ రేవ్ పార్టీ జరిగినట్లు అందులో తెలుగు సినీ ప్రముఖులు చాలా మంది పాల్గొన్నట్లు ఈ రోజు ఉదయం నుండి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే అందులో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ జు కొనసాగిస్తున్న హేమా కూడా ఉంది అని ఓ వార్త వైరల్ గా మారింది. ఇక ఈ వార్త అటు తిరిగి ఇటు తిరిగి హేమా వద్దకు చేరుకుంది. దానితో వెంటనే స్పందించిన హేమ నేను అక్కడ లేను అంటూ తెలియజేస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది.

ఇక తాజా వీడియోలో భాగంగా హేమ మాట్లాడుతూ ... బెంగళూరు లో నిన్న రాత్రి ఒక రేవ్ పార్టీ జరిగింది అని , అందులో అనేక మంది సినీ ప్రముఖులు ఉన్నారు అని , అలాగే ఆ పార్టీ లో నేను కూడా ఉన్నాను అని వార్తలు బయటికి వస్తున్నాయి. ఆ వార్తలు నా దగ్గర వరకు వచ్చాయి. ఇకపోతే నేను ఏ రేవ్ పార్టీ కి వెళ్ళలేదు. ప్రస్తుతం నేను హైదరాబాదు లో ఉన్న ఫామ్ హౌస్ లో ఉన్నాను. ఇక్కడే నేను చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎలాంటి రేవ్ పార్టీకి వెళ్ళలేదు. ఆ వార్తలను అస్సలు నమ్మకండి అంటూ స్పెషల్ గా ఓ వీడియోని విడుదల చేసింది.

ఇక తాజాగా హేమ తాను బెంగళూరు రేవు పార్టీకి వెళ్లలేదు అని తెలియజేస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే బెంగళూరు రేవ్ పార్టీలో ఎవరు ఉన్నారు అనేది ఇంకా క్లారిటీగా తెలియడం లేదు. ఇక మరి కొంత సమయంలో ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు. అందులో నిజం గానే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: