‘గుంటూరు కారం’ విడుదలై దాదాపు ఆరు నెలలు అవుతున్నప్పటికీ త్రివిక్రమ్ తన తదుపరి మూవీ ప్రాజెక్ట్ గురించి ఒక స్పష్టమైన క్లారిటీలోకి రాలేకపోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయవలసిన మూవీ ఫైనల్ అయినప్పటికీ ఈమూవీ కథ విషయమై ఇంకా అల్లు అర్జున్ నుండి స్పష్టమైన అంగీకారం త్రివిక్రమ్ కు రాలేదు అన్న గాసిప్పులు వస్తున్నాయి.



అంచనాలకు అనుగుణంగా ‘పుష్ప 2’ ఘన విజయం సాదిస్తే పాన్ ఇండియా రేంజ్ లో బన్నీ క్రేజ్ మరింత పెరిగే పరిస్థితులలో త్రివిక్రమ్ బన్నీకి పూర్తిగా నచ్చే కథ గురించి ఇంకా తన టీమ్ తో ఆలోచనలు కొనసాగిస్తూనే ఉన్నాడు అంటూ మరికొందరు లీకులు ఇస్తున్నారు. దీనికి తోడు ‘పుష్ప 2’ తరువాత బన్నీ తమిళ దర్శకుడు అఖిల్ తో సినిమా చేయడం ఖాయం అని వార్తలు వస్తున్న పరిస్థితులలో త్రివిక్రమ్ ఆలోచనలలో హీరో రామ్ ఉన్నాడు అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.



త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా కొనసాగుతున్న రోజులలో అతడిని నమ్మి దర్శకుడుగా ‘నువ్వే నువ్వే’ సినిమా తీసే అవకాశం ఇచ్చిన స్రవంతి రవికిషోర్ అంటే త్రివిక్రమ్ కు చాల గౌరవం అని అంటారు. రామ్ కు స్రవంతి రవికిషోర్ కు ఉన్న బాంధవ్యం రీత్యా ఎప్పటి నుంచో రామ్ తో ఒక సినిమా తీయమని స్రవంతి రవికిషోర్ త్రివిక్రమ్ పై ఒత్తిడి చేస్తున్నాడు అన్న వార్తలు ఉన్నాయి.



గతంలో నితిన్ తో ‘అ  ఆ’ మూవీ తీసిన విధంగా ఒక మీడియం రేంజ్ సినిమాను రామ్ తో తీయమని స్రవంతి రవికిషోర్ కోరిక అని అంటారు. అయితే త్రివిక్రమ్ ఆలోచనలు అన్నీ టాప్ హీరోల చుట్టూ తిరుగుతున్న పరిస్తితులలో ఎంతకాలమైనా ఈ మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడా లేదంటే తన పైనమ్మకం పెట్టుకున్న హీరో రామ్ వైపు మళ్ళు తాడా అన్న విషయం రానున్న రోజులలో తేలుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: