తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటి మనులలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి చందమామ మూవీ తో మొదటి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మగధీర మూవీ తో ఇండస్ట్రీ హిట్ ను అందుకొని ఒక్క సారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత నుండి ఈమె తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

వరుసగా ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు తగ్గడం , అందులో చాలా వరకు విజయాలను సాధిస్తూ వెళ్లడంతో ఈమె ఇప్పటికీ కూడా తెలుగు లో మంచి క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈమె వరసగా టీవీ షో ల , ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో ఈమె తెలుగు లో తనకు నచ్చిన నటీనటులు ఎవరు అనే దానిని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ... తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు.

అందులో నాకు కొంత మంది అంటే చాలా ఇష్టం. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , సమంత అంటే నాకు చాలా ఇష్టం అని కాజల్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన సినిమాలలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బృందావనం సినిమాలో కాజల్ , సమంత ఇద్దరూ కలిసి నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: