టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో ఎప్పుడూ చూడని డల్ సీజన్ నేడు చూస్తోంది. విద్యార్ధులకు సెలవులు అయినప్పటికీ ఎవరు ధియేటర్ల వైపు రావడంలేదు. నడుపుతున్న ధియేటర్లకు కరెంట్ ఖర్చులు కూడ రావడంలేదనీ తెలంగాణ వ్యాప్తంగా ధియేటర్లు మూత పడ్డాయి. మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ లో సినిమాలు ప్రదర్శిస్తున్నప్పటికీ జనం హోటల్స్ కు మాల్స్ కు పబ్ లకు వెళుతున్నారు కాని ధియేటర్ల వైపు చూడటంలేదు.ఇలాంటి పరిస్థితులలో ఈవారం అందుబాటులో ఉన్న కొద్ది ధియేటర్లను నమ్ముకుని విడుదలకాబోతున్న ‘లవ్ మి’ మూవీ పై చాలపెద్ద బాధ్యత ఉంది. సినిమాకు వచ్చే పాజిటివ్ టాక్ తో ధియేటర్లు అన్నీ మళ్ళీ తెరుచుకుంటాయని ఈమూవీ నిర్మాతలు చెపుతున్నప్పటికీ ఒక చిన్న సినిమాకు ఇంత శక్తి ఉంటుందా అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. దిల్ రాజ్ కాంపౌండ్ బ్యాకింగ్ ఈమూవీకి ఉండటంతో ఏదైనా అద్భుతం జరుగుతుందా అన్న ఆశ కొందరిలో ఉంది.వాస్తవానికి ఈమూవీ చిన్న సినిమా అయినప్పటికీ ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈమూవీకి సంగీతం అందించడంతో పాటలు చాల బాగుంటాయని చాలమంది ఆశించారు. అయితే ఈమూవీకి సంబంధించిన పాటలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు అన్నవార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు బ్యాక్ బోన్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజ్ మొదట్లో ఈమూవీ గురించి మాట్లాడుతూ ఈమూవీ కథ తాను వినప్పుడు ‘ఆర్య’ తర్వాత ఆ ఫీలింగ్ కలిగించిన కథ అనడంతో ఈమూవీ పై అంచనాలు బాగా ఏర్పడ్డాయి.అయితే దిల్ రాజ్ నిర్మించిన ఫ్యామిలీ స్టార్ అంచనాలను చేరుకోవడంలో ఫెయిల్ అవ్వడంతో లేటెస్ట్ గా దిల్ రాజ్ ఈమూవీ గురించి పెద్దగా మాట్లాడటంలేదు అని కొందరు అంటున్నారు. భారీ అంచనాలు లేకుండా విడుదల అయితే ‘లవ్ మి’ విజయం సాధిస్తుంది అన్న ఊహ దిల్ రాజ్ కు ఉండి ఉండాలి. ఈసినిమాతో పోటీగా విడుదల అవుతున్న సినిమాలు పెద్దగా ఏమీ లేకపోవడంతో ‘లవ్ మి’ కి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అంటూ చాలామంది అభిప్రాయ పడుతున్నారు..    మరింత సమాచారం తెలుసుకోండి: