"ప్రస్తుతం ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు చూస్తోంది. మాటల్లో చెప్పలే నంత ఆదరణ దక్కుతోంది. తెలుగు నటీ నటులకు, దర్శకుల కు, సాంకేతిక నిపుణులకు జాతీయ స్థాయి లో గుర్తింపు దక్కుతోంది.దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాలి'' అని ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్  అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన దర్శకుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ వేడుక లో దర్శకులు అనిల్‌ రావిపూడి , శ్రీరామ్‌ ఆదిత్య, శైలేష్‌ కొలను, శివ నిర్వాణలాంటి యువ దర్శకులు తమ స్టెప్పులతో అభిమానులను అలరించారు. అనంతరం.. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ కు దర్శకుల సంఘం తరఫున ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ 'దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని దర్శకుల దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నామని ప్రకటించినప్పుడు ఎంతో సంతోషం కలిగిందని దాసరి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బన్నీ. ఇంకా ఆయన మాట్లాడుతూ "పనిలో క్షణం తీరిక లేకుండా ఉండే దర్శకులు తమలో ఐక్యత ఉండాలనే ఉద్దేశం తో ఒక్క చోటికి చేరి, ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం వేడుకని ఇలాగు జరుపుకోవాలి. ఈ స్ఫూర్తితో సినీ పరిశ్రమలోని 24 శాఖల్లో వివిధ విభాగాలు ముందు కొచ్చి వేడుకలు నిర్వహించుకోవాలి. దానికి నా తర ఫున నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది' అన్నారు.ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌, విజయేంద్రప్రసాద్‌, మురళీమోహన్‌, శ్యామలాదేవి, నాని, అల్లరి నరేష్‌, అడవి శేష్‌, ఆనంద్‌ దేవర కొండ, సుధీర్‌బాబు, కార్తికేయ, హరీష్‌శంకర్‌, వంశీ పైడిపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌.శంకర్‌, మెహర్‌ రమేష్‌, యెల్దంది వేణు, చంద్రమహేష్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మారుతి, వశిష్ట, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: