ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో సంగీత దర్శకుడు అనిరుద్ మ్యానియా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇతడి క్రేజ్ తారా స్థాయికి చేరుకోవడంతో అతడి పారితోషికం 5 కోట్ల స్థాయిలో కొనసాగుతోంది అంటూ వార్తలు కూడ వస్తున్నాయి. ఇతడికి ఏర్పడిన క్రేజ్ తో చాలమంది టాప్ హీరోలు తమ సినిమాలకు అనిరుద్ ను సంగీత దర్శకుడుగా పెట్టమని తమ నిర్మాతల పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇతడి మ్యానియాకు జూనియర్ ఎన్టీఆర్ కూడ కనెక్ట్ కావడంతో అతడి లేటెస్ట్ మూవీ ‘దేవర’ కు అనిరుధ్ ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘దేవర’ మూవీలోని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే అది వైరల్ గా మారినప్పటికీ ఆసాంగ్ పై విమర్శలు కూడ బాగా వచ్చాయి.


రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈపాటకు అనిరుధ్ అందించిన ట్యూన్ అదిరిపోయింది అంటూ తారక్ అభిమానులు హడావిడి చేస్తూ ఉండగానే మరికొందరు నెగిటివ్ కామెంట్స్ ను కూడ మొదలుపెట్టారు. ఈపాట ట్యూన్ ఎనర్జిటిక్ గా అనిరుధ్ ట్యూన్ చేసినప్పటికీ ఈపాటలోని పదాలు అర్థం కావడం లేదనీ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈపాటలో తారక్ కన్నా అనిరుధ్ ఎక్కువగా కనిపిస్తూ అతడి హీరోయిజాన్ని చూపెట్టడంతో ఈమూవీలో హీరో ఎవరు అన్న సందేహాలు వాస్తున్నాయి అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.


పాట ట్యూన్ ను డామినేట్ చేసే విధంగా సౌండ్ విపరీతంగా ఉండటంతో రామజోగయ్య శాస్త్రి ఏమి రాసాడో తెలియడం లేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత విడుదల కాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ అంచనాలు అందుకోవడంలో ఏమైనా తేడా జరిగితే మాత్రం దాని ప్రభావం ‘దేవర’ మూవీ కలక్షన్స్ పై ఉంటుందని తారక్ అభిమానుల సందేహం..


మరింత సమాచారం తెలుసుకోండి: