టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని రోజుల క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం అనే సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో ఓ మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగానే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ సినిమా చేయాలి అనుకున్నాడు. కానీ అనూహ్యంగా పుష్ప పార్ట్ 2 మూవీ తర్వాత తమిళ దర్శకుడు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. దానితో అట్లీ సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. దానితో మధ్యలో రామ్ తో మూవీ చేయాలి అని త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు అందులో భాగంగా ఇప్పటికే ఓ కథను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే రామ్ కి ఆ కథ  ను వినిపించగా ఆ కథ సూపర్ గా నచ్చడంతో వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని స్రవంతి రవి కిషోర్ నిర్మించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం రామ్ "డబల్ ఈస్మార్ట్" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే కంప్లీట్ కానుంది. దానితో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే రామ్ , త్రివిక్రమ్ కాంబో మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: