చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన వాళ్లలో శోభన్ బాబు ఒకడు. టాలీవుడ్ నట దిగ్గజాలలో ఒకడిగా శోభన్ బాబు పాపులారిటి దక్కించుకున్నాడు.శోభన్ బాబు అప్పట్లో ఎన్నో మైలురాళ్లు రికార్డ్స్ సృష్టించిన స్టార్ హీరో. 1975లో శోభన్ బాబు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఒకటి, రెండు కాదు. ఇప్పటివరకు ఏ హీరో రికార్డులను బ్రేక్ చేయలేకపోయాడు. ఇకపై కూడా అది సాధ్యం కాదనడంలో అతిశయోక్తి లేదు. ఒకే ఏడాదిలో 8 సినిమాల్లో రిలీజ్ చేసి ఆరు సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాడు.మిగతా రెండు సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. సోగ్గాడు, జీవనజ్యోతి, బలిపీఠం, జేబుదొంగ, దేవుడు చేసిన పెళ్లి ఈ ఐదు సినిమాలు అదే ఏడాదిలో రిలీజై ఏకంగా 100 రోజులు ఆడాయి. ఇలా ఐదు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజై 100 రోజులు థియేటర్లో ఆడడం.. అది ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ లాంటి స్టార్ హీరోలు ఉన్న ఈ మూడు సినిమాలు.. పది కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడం అనేది సాధారణ రికార్డు కాదు. ఇక సోగ్గాడు 17 సెంటర్స్ లో, జీవనజ్యోతి 12 సెంటర్స్ లో , జేబుదొంగ 10 సెంటర్స్ లో వంద రోజులు ఆడింది. ఈ రికార్డ్‌ శోభన్ బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన 30 ఏళ్లకు సృష్టించగలగాడు. హైదరాబాదులో ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలు డైరెక్ట్ వంద రోజులు ఆడడం అనే రికార్డ్ కేవలం హీరో శోభన్ బాబుకు మాత్రమే సొంతమైంది.అలాగే ఒకే ఏడాది రిలీజ్ అయిన 8 సినిమాలు 15 కేంద్రాలకు పైగా 50 రోజులు ఆడడం అనే రికార్డును కూడా శోభన్ బాబు క్రియేట్ చేసాడు. ఇక సోగ్గాడు సినిమాతో సంచలనం సృష్టించి కోటి రూపాయలు వసూలు చేసిన 4వ సినిమాగా క్రెజ్‌ సంపాదించుకుంది. 56 రోజులు వరుసగా ఫుల్ అయిన తొలి తెలుగు మూవీ రికార్డ్ సృష్టించింది. 8 సినిమాల్లో ఆరు సినిమాల్లో టోటల్గా రూ.6 కోట్లకు పైగా గ్రాస్ వసులను కొల్లగొట్టాయి. ఇలా శోభన్ బాబు కెరీర్‌లో 1975 ఎంతో స్పెషల్ సంవత్సరంగా మిగిలిపోయింది. అప్పటివరకు యావరేజ్ హీరోగా ఉన్న శోభన్ బాబు ఈ ఏడాదిలోనే సూపర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: