హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరోగా పరిచయమయ్యాడు ఈ యంగ్ హీరో. ఇక హనుమాన్ సినిమాతో ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరో చేస్తున్న లేటెస్ట్ సినిమా మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే చేసారు. దాంతోపాటు టీజర్ ని సైతం విడుదల చేశారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన

 ఒక టాప్ సీక్రెట్ లీక్ చేశాడు మంచు మనోజ్ . ఇకపోతే ఇవాళ మంచు మనోజ్ పుట్టినరోజు కావడంతో సినిమా నుండి ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న గ్లిమ్స్ వీడియోని విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించిన ఈవెంట్ లో భాగంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. 'దాదాపు ఎనిమిదేళ్లు సినిమాకి దూరంగా ఉన్నాను. మూడేళ్ళ క్రిందట మళ్ళీ రీ ఎంట్రీ ఇద్దామని అనుకున్న తరువాత, కథలు వినడం స్టార్ట్ చేశాను. కానీ ఏ కథ నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. అప్పుడే తేజ సజ్జ కలిసి ఒక కథ వినాలని కోరాడు. అది విన్న నాకు వెంటనే చేయాలని

 అనిపించి ఓకే చెప్పేసాను. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం ఏప్రిల్ 2025 18న విడుదల కానుంది' అంటూ చెబుతూ మిరాయ్ రెండు భాగాలుగా రాబోతుందనే సీక్రెట్ ని రివీల్ చేసేసారు. దీంతో ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన ఈ సీక్రెట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అశోకుడు రహస్య తొమ్మిది పుస్తకాల నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. ఇక ఆ తొమ్మిది పుస్తకాల కలయిక అయిన ఒక గ్రంథాన్ని సంరక్షిచే  పాత్రలో తేజ సజ్జా నటిస్తున్నాడు. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాతో తేజ సబ్జా ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాల్సి ఉంది మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: