నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సై మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా , ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ భారత్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ మూవీ ని ఎ భారతి నిర్మించారు. ఈ సినిమా 2004 వ సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. 

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వచ్చాయి. ఇక ఈ మూవీ మంచి విజయం సాధించడంతో నితిన్ , జెనీలియా , రాజమౌళి ఈ ముగ్గురికి కూడా మంచి గుర్తింపు ఈ సినిమా ద్వారా దక్కింది. ఇకపోతే ఈ సినిమా విజయంలో కీరవాణి అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది.

మూవీ సంగీతానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. 2004 వ సంవత్సరం బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. మరి ఈ సినిమాను ఎప్పుడు రీ రిలీస్ చేస్తారో అనేది మరికొన్ని రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: