మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని రీతూ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె చిన్న వయసులో కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఈమె విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు మూవీ తో మొదటి సారి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయినప్పటికీ మంచి విజయం సాధించడం , అందులో రీతూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు వరుసగా అవకాశాలు పెరిగాయి. 

ఇప్పటి వరకు ఈమె కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించింది. కొంత కాలం క్రితం ఈమె విశాల్ హీరోగా రూపొందిన మార్క్ ఆంటోనీ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తమిళ్ లో బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. అలాగే తెలుగు లో కూడా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. రీతూ సినిమాల్లో వరుసగా నటిస్తూ వస్తున్నప్పటికీ పెద్దగా లుక్ లో మాత్రం చేంజ్ లేకుండా వచ్చింది. ఎప్పుడు ఈమె చీర కడితే ఒక రకంగానూ , మాడ్రన్ డ్రెస్ వేస్తే ఒక రకంగా ఇలా కనిపిస్తూ వచ్చేది. 

ఇకపోతే తాజాగా ఈమె తన లుక్ మొత్తాన్ని మార్చేసింది. ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకుంది. తన వెంట్రుకలను కూడా డిఫరెంట్ గా కట్ చేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. రీతు తాజా ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: