మోహ‌న్ భ‌గ‌త్‌ హీరోగా సుప్రిత స‌త్య‌నారాయ‌ణ్ హీరోయిన్ గా ఆరంభం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించగా ... వి అజ‌య్ నాగ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తోనే అజయ్ నాగ్ దర్శకుడి గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఇకపోతే ఈ సినిమా మే 10 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. విడుదలకు ముందు పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలను జనాల్లో క్రియేట్ చేసిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు పర్వాలేదు అనే స్థాయి టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. 

కాకపోతే ఈ సినిమా భారీ స్థాయి కలెక్షన్ లను వసూలు చేయడంలో విఫలం అయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద మొత్తంలో కలెక్షన్ లను వసూలు చేయడం లో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి ఈ టీవీ విన్ ఓ టీ టీ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను మే 23 వ తేదీ నుండి ఈటీవీ విన్ ఓ టీ  టీ ఫ్లాట్ ఫామ్ లో స్లీపింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే థియేటర్ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకున్న ఈ సినిమా ఓ టీ టీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మే 23 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: