కియారా అద్వానీ ఇండియాలోనే బడా హీరోయిన్స్ లో ఒకరు. సౌత్ టు నార్త్ అమ్మడు దున్నేస్తుంది. 2014లో ఫగ్లీ అనే మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది.ధోని బయోపిక్ లో హీరోయిన్ గా నటించి హిట్ ఖాతాలో వేసుకుంది. ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం భరత్ అనే నేను. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ సూపర్ హిట్. కియారా గ్లామర్ కి కుర్రకారు ఫిదా అయ్యారు.అనంతరం రామ్ చరణ్ కి జంటగా వినయ విధేయ రామ చేసింది. ఈ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి గేమ్ ఛేంజర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల గేమ్ ఛేంజర్ మూవీ నుండి ఓ సాంగ్ విడుదల చేశారు. 'జరగండి జరగండి' అనే ఈ ఫస్ట్ లిరికల్ ఆకట్టుకుంది.కాగా కియారాకు ఉన్న క్రేజ్ రీత్యా ఆమె కాలు బయటపెడితే చాలు మీడియా చుట్టుముడుతుంది. అభిమానులను అదుపు చేసేందుకు బౌన్సర్స్ సిద్ధంగా ఉంటారు. ఇంతటి సెక్యూరిటీ మధ్య కూడా కియారా అద్వానీని ఓ వీధి కుక్క వెంబడించింది. ఎక్కడికో ప్రయాణమైన కియారా అద్వానీ కారులో వచ్చి ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగారు. ఆమె లోపలికి వెళ్లే సమయంలో వీధి కుక్క ఆమెను వెంబడించింది.అయితే ఫోటోగ్రాఫర్స్ ఆమెను చుట్టుముట్టారు. దాంతో వీధి కుక్క అక్కడి నుండి వెళ్ళిపోయింది. కియారా వెనుక వీధి కుక్క వస్తున్న వీడియో వైరల్ అవుతుంది. ముంబై ఎయిర్ పోర్ట్ అథారిటీ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. వీధి కుక్కలను లోపలి ఎలా రాణిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులపై దాడి జరిగితే పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే 2023లో కియారా అద్వానీ ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక కియారా కెరీర్ పరిశీలిస్తే... గేమ్ ఛేంజర్ తో పాటు వార్ 2 మూవీ చేస్తున్నట్లు సమాచారం. రెండు భారీ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: