విజయ్ దేవరకొండ-ఆనంద్ దేవరకొండ ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలిసిందే. అయితే కాలేజీ రోజుల్లో విజయ్ దేవరకొండ లవర్స్ తో ఆనంద్ దేవరకొండ కొన్ని చిలిపి పనులు చేశాడట.అది కూడా విజయ్ దేవరకొండ మాదిరి. ఈ క్రేజీ మేటర్ తాజాగా వెలుగులోకి వచ్చింది.విజయ్ దేవరకొండ హీరోగా పరిశ్రమలో నిలదొక్కుకున్నాడు. తనకంటూ మార్కెట్, ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ సక్సెస్ కావడంతో అమెరికాలో జాబ్ చేసుకునే ఆనంద్ దేవరకొండ కూడా పరిశ్రమలో అడుగుపెట్టాడు. దొరసాని చిత్రంతో హీరో అయ్యాడు.మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ గత ఏడాది విడుదలైన బేబీ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం గం గం గణేశా. మే 31న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండకు ఓ ప్రశ్న ఎదురైంది. మీ వాయిస్ అన్నయ్య విజయ్ దేవరకొండకు దగ్గరగా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కూడా ఇమిటేట్ చేస్తున్న భావన కలుగుతుందని మీడియా ప్రతినిధి అడిగారు. ఈ ప్రశ్నకు పలుమార్లు ఎదురైందని ఆనంద్ దేవరకొండ ఒప్పుకున్నాడు.ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే విజయ్ దేవరకొండకు ఫోన్ చేయాలని కోరారు. వాళ్ళ కోరిక మేరకు ప్రెస్ మీట్లో ఉన్న ఆనంద్ దేవరకొండ అన్నయ్యకు కాల్ చేశాడు. మన ఇద్దరి వాయిస్ ఒకలానే ఉంటుంది అనేది ప్రశ్న అని విజయ్ దేవరకొండకు ఆనంద్ దేవరకొండ చెప్పాడు.నిజానికి చిన్నప్పటి నుండి ఈ అయోమయం ఉంది. అమ్మ కూడా ఎవరు పిలిచారో పోల్చుకోలేకపోయేది. నా సినిమాలకు డబ్బింగ్ చెప్పమని అడుగుతూ ఉంటాను. లవర్స్ ని కూడా మేము ఫ్రాంక్ చేసిన సందర్భాలు ఉన్నాయి... అని విజయ్ దేవరకొండ అన్నారు. ఏషియా నెట్ తెలుగు ప్రతినిధి ఎవరి లవర్ ని ఎవరు ఫ్రాంక్ చేశారని స్పష్టత కోరడం జరిగింది.ఆనంద్ దేవరకొండకు లవర్స్ లేరు. కాలేజీ రోజుల్లో నాకు ఉండేవారు. నా ఫోన్ తీసుకుని నేను మాట్లాడుతున్నట్లు నా లవర్స్ తో ఆనంద్ దేవరకొండ మాట్లాడేవాడు. అలా వాళ్ళను ఫ్రాంక్ చేసేవాడని చెప్పుకొచ్చాడు. వాయిస్ కి సంబంధించిన ప్రశ్న ఎటో వెళ్లి... కాలేజీ రోజుల్లో దేవరకొండ బ్రదర్స్ చేసిన చిలిపి పనులు బయటకు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: