టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య "విరూపాక్ష" సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కథను నాగ చైతన్య కు వినిపించగా ఆయనకు ఈ కథ సూపర్ గా నచ్చినట్లు ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అని ఎక్సైజ్మెంట్ లో చైతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కార్తీక్ కూడా ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను వేగ వంతంగా పూర్తి చేస్తున్నట్లు , అందులో భాగంగా కొన్ని క్యారెక్టర్ లకి నటీ నటులను కూడా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఒక అదిరిపోయే రేంజ్ క్యారెక్టర్ ఉన్నట్లు , దాని కోసం ఒక గొప్ప నటుడు అయితే బాగుంటుంది అనే ఉద్దేశంలో యూనిట్ విజయ్ సేతుపతి ని తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నట్లు , అందుకోసం ఆయనను కలిసి కథను వినిపించడం కోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే మరికొన్ని రోజుల్లోనే కార్తీక్ , విజయ్ సేతుపతి కి కథ వినిపించనున్నట్లు , ఆ కథలో ఆయన క్యారెక్టర్ నచ్చితే ఈయన గనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటే ఈ సినిమాలోకి విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం నాగ చైతన్య , చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండెల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేసే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: