తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ , నాని శర్వానంద్ , మంచు విష్ణు హీరోలుగా రూపొందుతున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం శర వేగంగా జరుగుతున్నాయి. వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు. ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ గార్డెన్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ చిత్రకరణను ఫుల్ స్పీడ్ గా తెరకెక్కిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను కొనసాగిస్తున్నారు.

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

శర్వానంద్ ప్రస్తుతం తన కెరియర్ లో 36 వ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు శర్వానంద్ మరియు కొంతమంది ఇతరులపై శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం మంచు విష్ణు మరియు కొంత మంది ఇతరులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: