టాలీవుడ్ యువ నటుడు సుధీర్ బాబు , జ్ఞానేశ్వర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన హరోం హర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ఈ సినిమాను మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసిన తర్వాత ఈ మూవీ యూనిట్ ప్రచారాలను కూడా మొదలు పెట్టింది. దానితో ఈ సినిమా దాదాపుగా మే 31 వ తేదీన విడుదల కాయడం ఖాయం అని అంతా భావించారు. 

కానీ సడన్ గా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క విడుదల తేదీని మార్చి వేశారు. ఈ మూవీ ని మే 31 వ తేదీన విడుదల చేయడం లేదు అని , కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు. హరోం హర మూవీ ని జూన్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి మే 31 వ తేదీన అనేక సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కానున్నాయి.

అందుకోసమే ఈ సినిమాను విడుదల వాయిదా వేసి ఉంటారు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి అందుకోసమే ఈ సినిమాను విడుదల వాయిదా వేశారా ..? లేక ఈ మూవీ కి సంబంధించిన ఇంకా పనులు ఏమైనా బ్యాలెన్స్  ఉండడం ద్వారా ఈ మూవీ ని మేకర్స్ వాయిదా వేశారా మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది క్లారిటీ లేదు. ఇకపోతే కొంత కాలం క్రితం సుదీర్ బాబు "మామ మచ్చింద్ర" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పర్వాలేదు అని అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి హరోం హర సినిమాతో సుధీర్ బాబు ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sb