ప్రస్తుతం హవా అంతా ఓటీటీలదే. భాషాబేధం లేకుండా.. వేర్వేరు లాంగ్వేజ్‌లలో సూపర్‌ హిట్టైన సినిమాలను స్థానిక భాషలోకి డబ్బింగ్‌ చేసి, లేదంటే ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌తో విడుదల చేస్తుండటంతో,వీటికి క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు సినిమా థియేటర్లలో సినిమాలు చూసే వారి కన్నా.. ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల కోసం ఎదురు చూసేవారే ఎక్కువవుతున్నారు. దీనిలో భాగంగా ప్రతి వారం ఓటీటీల్లోకి కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇక దీనిలో భాగంగా తాజాగా తెలుగులో విడదలైన ఓ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ సినిమా ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వడానికి రెడీ అవుతోంది. ఇంతకు అది ఏ సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుంది అంటే..థియేటర్లలో విడుదలైన ప్రతి కొత్త సినిమా నెల రోజుల్లోగా ఓటీటీలో రిలీజ్‌ అవుతాయి. ఇక కొన్ని సినిమాలైతే.. విడుదలైన వారం, రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన తెలుగు థ్రిల్లర్‌ మూవీ ఒకటి.. థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే.. ఓటీటీలోకి రాబోతుంది. అదే ఆరంభం. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.

థ్రిల్లర్ మూవీ మే 10న థియేటర్లలో రిలీజైంది. రెండు వారాలు కూడా గడవకముందే ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మే 23 నుంచి ఈటీవీ విన్‌ యాప్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యిందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో సుప్రిత సత్యనారాయణ్ హీరోయిన్‌గా నటించగా.. భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రలు పోషించారు. వి అజయ్ నాగ్ ఈ మూవీతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓ కన్నడ నవల ఆధారంగా టైమ్ లూప్ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు వి అజయ్‌ నాగ్‌.ఇక ఈ సినిమాలో కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ భగత్ కీలక పాత్రలో నటించాడు. ఇక ఆరంభం చిత్రంలో మిగిల్‌ పాత్రలో మంచి నటన కనబరిచి.. మరోసారి అందరి ప్రశంసలు పొందాడు. టీజర్‌, ట్రైలర్‌లతో సినిమా మీద అంచనాలు పెంచారు. ఇక విడుదలయ్యాక కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇకపోతే ఈ సినిమా అంతా ఓ కేసులో ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు అనే అంశం చుట్టూ తిరుగుతుంటుంది. ఈ క్రమంలో అతడికి దొరికిన ఓ డైరీలో కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుంటాడు. మిగిల్‌ ఎంతో చిత్రంగా జైలు నుంచి బయటపడతాడు. మరి పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్‌ చేశారు అన్నదే సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: