ఒక్కొక్కరు ..ఒక్కొక్కలా ..తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు . ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విష్ చేస్తూ తమ ప్రియమైన వ్యక్తులకు విషెస్ చెబుతూ ఉంటారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం కావడంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మార్మోగిపోతోంది. తారక్ సినిమాలు, వీడియోలు, ఫొటోలు ట్రెండింగ్ లోకి వచ్చాయి. సినీ ప్రముఖులంతా యంగ్ టైగర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డియరెస్ట్ అంటూ రామ్‌చరణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తమ మధ్య ఉన్న రిలేషన్ ను బయటపెట్టారు.దేవర నుంచి విడుదలై ఫైర్ పాటపై సూపర్ కామెంట్ పెట్టాడు. ''హ్యాపీ బర్త్ డే బావా. దేవర ఫియర్ సాంగ్ ఫైర్‌లా ఉంది'' అనే క్యాప్షన్ జతచేశాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. వీరిద్దరు బంధువులు కాకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో చాలా సన్నిహితంగా ఉండే క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తారక్ ను బావా అని ప్రేమగా పిలవడం, తారక్ కూడా బన్నీని బావా అనడం.. చూసి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. వాస్తవానికి వీరిమధ్య ఎటువంటి బంధుత్వం లేకుండా బావా బావా అని పిలుచుకుంటూ నిజమైన బంధుత్వాన్ని నిరూపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.భవిష్యత్తులోనైనా వీరిద్దరూ నిజంగానే బంధువులు కావాలని, బంధుత్వాన్ని కుదుర్చుకోవాలని అప్పుడు ఇద్దరి రేంజ్ ఒక రేంజ్ లో ఉంటుందని, ఇండియాను రఫ్పాడించేయొచ్చని సోషల్ మీడియాలో తారక్, బన్నీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 చేస్తున్నారు. ఆగస్టు 15న విడుదల కానుంది. అయితే ఆ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా? లేదా? అనే సందేహం ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. అలాగే దేవర చిత్రం ఏప్రిల్ ఐదున విడుదల కావాల్సి ఉన్నప్పటికీ విజయదశమికి వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: