అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుటున్నాడు. అక్కినేని ఫ్యామిలీ వారుసుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో నాగచైతన్య ముందు ఉంటాడు.ఇక నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక నాగచైతన్యకు కార్లు అంటే చాలా ఇష్టం.ఆయన గ్యారేజ్లో.. ఫెరారీ నుంచి బీఎండబ్ల్యూ వరకు ఎన్నో లగ్జరీ కార్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ లిస్ట్లోకి మరో కొత్త లగ్జరీ కారు చేరింది. అదే.. పోర్షే 911 జీటీ3 ఆర్ఎస్. ఈ విషయాన్ని.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు నాగ చైతన్య.అందుతున్న సమాచారం మేరకు ఈ కొత్త కారు ఖరీదు రూ. 3.5 కోట్లు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చైతూ చెన్నై షోరూమ్‌లో కారు కొన్నాడని తెలిసింది. కార్స్ అంటే ఎంతో ఇష్టపడే చైతూకి ఇప్పటికే mercedes-benz G63 AMG, ఎరుపు రంగు ఫెరారీ 488 GTB కార్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆయన పోర్షే 911 జిటి3 ఆర్ఎస్‌ని కూడా తన లిస్టులో కలిపేశాడు. ఇక నాగ చైతన్య కొనుగోలు చేసిన సిల్వర్ కలర్ పోర్షే జిటి3 ఆర్ఎస్ చెన్నైలో బుక్ చేయబడిందని చెబుతున్నారు. ఈ కారు మే 17, 2024న రిజిస్టర్ చేయబడిందని అంతేకాదు హైదరాబాద్‌లోని మొదటి పోర్షే 911 GT3RS ఇదే నాని చెబుతున్నారు. ఇక చైతూ తన కొత్త కారులో నగరం చుట్టూ తిరుగుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపించింది.ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే 911 GT3 RS మూడు డ్రైవ్ మోడ్‌లతో ఉంటుంది. సాధారణ, స్పోర్ట్ అలాగే ట్రాక్ మోడ్ లో ఈ కారును నడపొచ్చు. అలాగే, కారును 0 నుండి 100kph వరకు 3.2 సెకన్లలో 296kph గరిష్ట వేగంతో నడపవచ్చు. ఇంజన్ గురించి చెప్పాలంటే ఈ కారులో 4.0-లీటర్ ఫ్లాట్-సిక్స్ ఇంజన్ ఉంది. 524hp శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ సూపర్‌కార్‌లో మెరుగైన 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ స్టాండర్డ్ 911 కంటే ఒక గేర్ తక్కువగా ఉంటుంది.GT3 RS దాని ఆధారంగా ట్రాక్ చేయడానికి డ్రాగ్ రిడక్షన్ సిస్టమ్ (DRS) తో వస్తుంది. ప్రస్తుత ఫార్ములా వన్ కార్లలో ఇదే సాంకేతికత కనిపిస్తుంది. ఈ సాంకేతికత సహాయంతో, డ్రాగ్ తగ్గించబడుతుంది, తద్వారా సరళ రేఖ వేగం పెరుగుతుంది. బ్రేకింగ్ గురించి చెప్పాలంటే RS ఇప్పుడు 32mm పిస్టన్‌తో పెద్ద ఫ్రంట్ బ్రేక్‌ను పొందుతుంది.అంతేకాదు.. ఈ లగ్జరీ కారులో డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ రోడ్లపై కనిపించారు నాగ చైతన్య.ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన కార్తికేయ ఫేమ్ దర్శకుడు చందు మొండేటితో తండేల్ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై జాలరిగా కనిపించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. మరి నాగ చైతన్య చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: