సినిమా ఇండస్ట్రీ లో ఏ భాషలో చూసిన కూడా స్టార్ కిడ్స్ ది హవా కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అప్పటికే ఇండస్ట్రీకి హీరోలు లేదా హీరోయిన్ లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా ఎదిగిన వారు.. ఇక సీనియర్లుగా మారిన తర్వాత వారి వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. ఈ క్రమం  లోనే ప్రస్తుతం ఇక భారత చలన చిత్ర పరిశ్రమలో అన్ని భాషల్లో కూడా ఇలా ఎంతోమంది స్టార్స్ వారసులు ఎంట్రీ ఇచ్చి ఇక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఒక హీరో సీనియర్ అవుతున్నాడు అంటే చాలు ఇక హీరో వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తండ్రి వారసత్వాన్ని నిలబెడతాడని అభిమానులు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఇలా స్టార్ కుటుంబం నుంచి రాబోయే హీరో గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఒకవేళ స్టార్ హీరో కొడుకు సినిమాల్లోకి రావడానికి ఇష్టపడకపోతే అభిమానులు  ఎంత నిరుత్సాహపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తన అభిమానులకు ఇలాంటి ఒక చేదు వారితో చెప్పాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.


 తన కుమారుడు ఆరవ్ సినిమాల్లోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తిగా లేడు అన్న విషయాన్ని అక్షయ్ కుమార్ తెలిపాడు. ప్రస్తుతం ఆరువ్ లండన్ లో చదువుతున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. అతనికి సినిమాల కన్నా ఫ్యాషన్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది అంటూ అక్షయ్ చెప్పిన కామెంట్స్ ఫ్యాన్సీని నిరాశకు గురిచేసాయి  ఆరవ్ కు నచ్చింది చేయమని మేం కూడా సూచించాం అంటూ అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు. అయితే అక్షయ్ కుమార్ ఇండస్ట్రీకి పరిచయం అవుతాడని అభిమానులు అనుకుంటున్నవేలా ఈ స్టార్ హీరో చెప్పిన విషయం మాత్రం అందరిని అవ్వక ఎలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: