టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ తన అందం, నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక ఆతర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరసగా ఆఫర్స్ అందుకుంటూ కోలీవుడ్, టాలీవుడ్‌లో తన నటనతో మాయ చేసింది. స్టార్ హీరోల అందరరిసరసన నటించడం, ఆ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ అమ్మడు లక్కీ గర్ల్‌గా కూడా మారిపోయింది. దీంతో అమ్మడుకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. అలా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ప్రస్తుతం సమంత చేతిలో పెద్ద ప్రాజెక్ట్స్ ఏం లేనట్లు తెలుస్తోంది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, ఎప్పటికప్పుడు తన అభిమానులతో పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.సమంత చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సరిగ్గా ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్న సమయంలో ఆమె ఈ పోస్ట్ చేయడంతో ఆర్సీబీ కోసమేనా అంటూ కొందరు ఫ్యాన్స్ అడుగుతున్నారు.అయితే దాని వెనుక అర్థం ఇంకేదో ఉందని మరికొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి సామ్ చేసిన ఈ పోస్ట్ పై ఫ్యాన్స్ మధ్య మంచి చర్చే నడుస్తోంది.

బుధవారం మే 22ఉదయం సమయం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. అందులో "ఐ వానా సీ యూ విన్" అనే అక్షరాలు ఉన్నాయి. అంటే మీరు గెలిస్తే చూడాలని ఉంది అని. దీనికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ కూడా ఇంట్రెస్టింగా ఉంది. "మీ హృదయం ఏం కోరుకుంటున్నా, మీకు ఎలాంటి ఆకాంక్షలు ఉన్నా, మీ వెంట నేనున్నాను. మీరు విజయానికి అర్హులు" అనే క్యాప్షన్ ఉంచింది.ఇది చూసి కొంత మంది ఫ్యాన్స్ సమంత ఈ పోస్ట్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసమే అని కామెంట్స్ చేశారు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం మే 22అహ్మదాబాద్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఆర్సీబీ ఎలిమినేటర్ లో తలపడనుంది. ఈరోజే సామ్ కూడా ఈ పోస్ట్ చేయడంతో అందరూ దాని గురించే అని భావిస్తున్నారు.అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం దీని వెనుక అర్థం అది కాదని చెబుతున్నారు. "ఆమె జీవితం గురించి ఈ విషయం చెబుతోంది. కానీ కొందరు ఐపీఎల్ కిడ్స్ మాత్రం తమకు ఇష్టమైన ఫ్రాంఛైజీ గురించి అనుకుంటున్నారు" అని ఓ అభిమాని కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్ వెనుక అసలు ఆమె ఉద్దేశం ఏంటన్నది మాత్రం తెలియడం లేదు.సమంత ఇదే పోస్ట్ ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనూ పోస్ట్ చేసింది. దానికంటే ముందు ఉదయాన్నే తాను జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. తన స్టైల్లో చిల్ అవడం అంటే ఇదే అనే క్యాప్షన్ తో ఆ పోస్ట్ చేసింది. ఫిట్‌నెస్ పై బాగా దృష్టిసారించే సమంత.. జిమ్ లో చెమటలు కక్కుతూ.. హైఫ్లైయింగ్ కిక్స్ ప్రాక్టీస్ చేయడం ఆ వీడియోలో చూడొచ్చు.ఇక సమంత ఏడాది సినిమా బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్ లతో బిజీ అవుతోంది. ఇప్పటికే సిటడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ పూర్తి చేసి డబ్బింగ్ కూడా చెప్పేసింది. సిటడెల్ హనీ బన్నీ అనే ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఆమె నటించింది. ఇక తన సొంత ప్రొడక్షన్ కంపెనీ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో బంగారం అనే మూవీని కూడా సమంత అనౌన్స్ చేసింది. ఇదే కాకుండా అట్లీ, అల్లు అర్జున్ మూవీలోనూ ఆమె నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: