సినిమా ఇండస్ట్రీ లో మూవీ లు వదులుకోవడం అనేది చాలా సార్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒకరికి కథ చెప్పి అతనితో సినిమా చేద్దాం అనుకున్న సందర్భాలలో వారు కథ మొత్తం విని ఆ కథ నచ్చకనో లేక ఆ సినిమాకు తేదీలను అడ్జస్ట్ చేయలేకో లేక వేరే ఇతర కారణాలతో సినిమాలను వదులుకున్న సందర్భాలు అనేకం ఉంటాయి. అలాంటి సినిమాలలో కొన్ని విజయాలను సాధిస్తే , మరి కొన్ని అపజాయలను కూడా సాధిస్తాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాని కూడా తన కెరియర్ లో కొన్ని సినిమాలను వదులుకున్నాడు.

అలాంటి సినిమాలలో ఎఫ్ 2 మూవీ ఒకటి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. మరి అంత మంచి విజయం సాధించిన ఈ సినిమాను నాని ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు "ఎఫ్ 2" అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ కథను అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ మూవీ లో వరుణ్ తేజ్ స్థానంలో మొదట నాని ని అనుకున్నారట. అందులో భాగంగా ఆయనకు అతను కూడా వివరించారట. కథ మొత్తం విన్న నాని సినిమా కథ సూపర్ గా ఉంది, ఎప్పటి నుండి షూట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అని అడిగాడట.

దానితో వారు ఈ సినిమా షూటింగ్ తేదీలను చెప్పడంతో ఆ సమయం లో నాకు వేరే సినిమాలు ఉన్నాయి. ఆ షెడ్యూల్ ప్రకారం అయితే నేను సినిమా చేయడం కష్టమే అని చెప్పారట. కాకపోతే మూవీ బృందం వారు మాత్రం కచ్చితంగా ఈ సినిమా షెడ్యూల్ ని అదే తేదీల్లో చేయాలి అనుకోవడంతో నానితో చేయడం కష్టం అనే ఉద్దేశంతో వరుణ్ తేజ్ ను కలవడం , ఈ కథ చెప్పడం , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అలా ఎఫ్ 2 మూవీ లోకి ఈయన ఎంట్రీ ఇవ్వడం జరిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: