టాలీవుడ్ యువ నటుడు ఆశిష్ హీరోగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా కొత్త దర్శకుడు అర్జున్ భీమవరపు దర్శకత్వంలో లవ్ మీ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని మే 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. 

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈయన సంగీతం అందించడంతో ఈ సినిమా ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఏది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి చాలా బాగుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకొని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటుందో , లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఆశిష్ కొంత కాలం క్రితం రౌడీ బాయ్స్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా కూడా మంచి అంచనాలతోనే థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. మరి ఈ హీరో నటించిన రెండవ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో ఈ నటుడికి ఏ రేంజ్ గుర్తింపును తీసుకువస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: