కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటలలో ధనుష్ ఒకరు. ఈయన ప్రస్తుతం రాయన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ధనుష్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇలా ధనుష్మూవీ లో హీరో గా నటిస్తూ ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 

మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుండి కొన్ని రోజుల క్రితమే మూవీ బృందం వారు ఒక పాటను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా నుండి రెండవ పాట విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన ను విడుదల చేశారు. ఈ మూవీ లోని రెండవ పాటను మే 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న సందీప్ కిషన్ , అపర్ణ బాల మురళి ఉన్నారు. మేకర్స్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో సందీప్ కిషన్ సైకిల్ తొక్కుతూ ఉంటే దాని ముందు అపర్ణ  బల మురళి కూర్చుని ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలోని మొదటి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో రెండవ సాంగ్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే ధనుష్ కొంత కాలం క్రితం కెప్టెన్ మిల్లర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో కూడా సందీప్ కిషన్ కీలకమైన పాత్రలో నటించాడు. మరోసారి ఆయన హీరోగా రూపొందుతున్న రయాన్ మూవీ లో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk