టాలీవుడ్ యువ నటుడు ఆశిష్ రెడ్డి కొంత కాలం క్రితం రౌడీ బాయ్స్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ హీరోగా రూపొందిన మొదటి సినిమా కావడం , హుషారు మూవీ తో యూత్ ఫుల్ బ్లాక్ బాస్టర్ అందుకున్నశ్రీ హర్ష కోనుగంటి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా లవ్ మీ అనే సినిమాలో హీరో గా నటించాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని మే 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు.

అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం కొన్ని గంటల క్రితమే అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమాని 136 నిమిషాలు అనగా (2 గంటల 16 నిమిషాల) నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. మరి రౌడీ బాయ్స్ మూవీ తో పెద్ద సక్సెస్ ను అందుకోలేకపోయిన ఆశిష్మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: