దర్శక దీరుడు రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన బాహుబలి మూవీ ఎంత పెద్ద విజయవంతం అయిందో మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ సినిమాలో నటించిన నటీనటులకి కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన కట్టప్ప పాత్రకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కట్టప్ప పాత్రలో ఎనలేని క్రేజ్ దక్కించుకున్న సత్యరాజ్ మరో బంపర్ ఆఫర్ కొట్టేశారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ లో నటుడు సత్యదేవ్ చాన్స్ అందుకున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ క్రమంలోనే మోడీ బయోపిక్ లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఎట్టకేలకు సత్యదేవ్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ..." ప్రధాని మోడీ బయోపిక్ లో నేను నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నేను కూడా చూశాను. కానీ ఆ పాత్ర కోసం నన్ను ఇప్పటివరకు ఎవ్వరూ సంప్రదించలేదు " అంటూ చెప్పుకొచ్చాడు సత్యదేవ్. అలా మోడీ బయోపిక్ లో తాను కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.

మోడీ బయోపిక్ లో తాను యాట్‌ చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని ఒక్క మాటతో చెప్పారు. ఇక సోషల్ మీడియాలో వచ్చేటప్పుడు వార్తలను చూసి జనం నమ్ముతున్నారని కూడా ఆ వార్తల్లో వాస్తవం లేదని సత్యదేవ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో మోడీ బయోపిక్ లో సత్యదేవ్ నటించబోతున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పడింది. ఇక ప్రధాని మోడీపై ఇప్పటికే బయోపిక్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రధానిపై మేకర్స్ మరో బయోపిక్ ని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ బయోపిక్ లో ఎవరెవరు నటించబోతున్నారు అనే అంశాలు మరి కొన్ని రోజుల్లో తెలియనున్నాయి.ఇక ఈ బయోపిక్ లో ఈయన నటించకపోతే మరెవరు నటించబోతున్నారు అనే ఆసక్తి మరింత రేగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: