జూనియర్ ఎన్టీఆర్.. ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని పేరు. ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు తో పాటు అభిమానులు కూడా తారక్ కి స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఇక మరి ముఖ్యంగా అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ దర్శకుడు సతీమణి తనతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ విషెస్ తెలియజేసింది.

పైన ఫోటోలో ఎన్టీఆర్ తో చనువుగా ఉన్న అమ్మాయి మరెవరో కాదు పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ సతీమణి లికిత రెడ్డి. ఈ ఏడాది మార్చ్ లో తారక్ తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్ళాడు. ప్రశాంత్ నీల్ ఇంటికి వెళ్లిన సమయంలో అందరూ కలిసి సరదాగా ఫోటోలను సైతం దిగారు. ఇక అప్పుడు తీసుకున్న ఫోటోనే ఇది. ప్రెసెంట్ ఈ పిక్ సోషల్ మీడియాలో నెట్టెంత వైరల్ గా మారింది. తెలుగు మూలలున్న లిఖితకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట.

అతని సినిమాలు చూస్తూనే పెరిగిందట. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో ఇంటికి వచ్చేసరికి అలా ఆనందం వ్యక్తం చేస్తూ ఫోటో దిగింది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే అఫీషియల్ క్లారిటీ కూడా వచ్చింది. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు మేకర్స్. ప్రెసెంట్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనంతరం హ్రితిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 షూటింగ్లో పాల్గొనున్నారు.ఇక ఆ తరువాత ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు తారక్.

మరింత సమాచారం తెలుసుకోండి: