పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాపై రోజురోజుకీ అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. పురాణాల ఆధారంగా ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విష్ణుమూర్తి పదో అవతారం భావించే కల్కి ఆధారంగా ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ ఉండనుంది. ఇక ఈ మూవీ గ్లోబల్ రేంజ్ లో జూన్ 27న రిలీజ్ కానుంది. ఇక కల్కి చిత్రంలో బుజ్జి అనే ప్రత్యేక వాహనం గురించి కొంత కాలంగా భారీ హైప్స్ నెలకొన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ వెహికల్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు నిన్న అనగా మే 22న భారీ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. కల్కి టీం చేసిన తొలి ప్రమోషనల్ ఈవెంట్ ఇదే. కాగా భైరవ, బుజ్జి వీడియోను రిలీజ్ చేయగా ఇది అద్భుతమైన విజువల్స్ తో అద్భుతం అనిపించేలాగా ఉంది. బుజ్జి వాహనానికి ఉండే బ్రెయిన్ డైలాగ్ తో ఈ వీడియో మొదలైంది. ఇక ఈ మిషన్ అసాధ్యమని.. షారుక్ ఖాన్ నామూన్కిన్ ఐకానిక్ డైలాగ్ బుజ్జి చెప్పడంతో ఈ వీడియో షురూ అయింది. అయితే ఫుల్ స్పీడ్ లో వెళ్లాలని బుజ్జికి ఆదేశాలు ఇస్తాడు బైరవ అలియాస్ ప్రభాస్. ఇక ఈ ఒక్క రోజు పాజిటివ్గా ఉండాలని భైరవ అడిగితే తిరుగులేనిదని భైరవ అంటాడు.

ఈ బుజ్జి వెహికల్ అత్యంత వేగంతో వెళ్తూ గాల్లోకి ఎగిరేలా కూడా ఉంది. చూసేందుకు అద్భుతంగా కనిపిస్తుంది. లవ్ యు బుజ్జి అని భైరవ అంటే పర్వాలేదులే అని బుజ్జి బ్రెయిన్ అంటుంది. ఇక కల్కి సినిమాలో భైరవ అతడి స్పెషల్ వెహికల్ బుజ్జి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉండనున్నట్లు ఈ వీడియో ద్వారా అర్థమైంది. ఈ బుజ్జి వాహనానికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో హైలెట్. కల్కి టీం రిలీజ్ చేసిన భైరవ మరియు బుజ్జి వీడియోలో విజువల్స్ మాత్రం గూస్బంస్ పుట్టించే విధంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ అద్భుతం అనిపించేలాగా ఉంది. ఇక భారీ హాలీవుడ్ మూవీ రేంజ్ లో అవుట్ ఫుట్ను దర్శకుడు నాగ అశ్విన్ అందించారు. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎటువంటి టాక్‌ దక్కించుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: