యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ గా ఏది గాడు తారక్. దివంగత నటుడు హరికృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ప్రజెంట్ ఇంతటి రేంజ్ కి ఎదగడం గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ కి తాతగారి పోలికలు ఉండడం కారణంగా బాగా కలిసి వచ్చి వెంటనే స్టార్ హీరో అయిపోతాడు అని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ అతని కెరీర్ ప్రారంభంలో కుటుంబం అతనికి అండగా నిలవకపోవడం ఒక చిక్కుగా మారింది. అందుకే కొత్త నటీనటుల లాగానే తాను కూడా ఇండస్ట్రీలో ఎదగాల్సి వచ్చింది. కానీ ఎన్టీఆర్ ఆ కష్టాన్ని ఎప్పుడూ లెక్క చేయలేదు. ఎటువంటి కష్టాన్ని అయినా ఎంతో సులభంగా ఫేస్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోయాడు. ఇక ఎన్టీఆర్ అంత కష్టాన్ని చూడబట్టే ప్రస్తుతం ఈ రేంజ్కి ఎదిగాడు అని తన స్నేహితులు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలకి సినీ కెరీర్ అంతా సాఫీగా సాగుతుంది.

కానీ ఒక తారక్ విషయంలో మాత్రం అది జరగలేదు. అందుకే అతను చాలా స్పెషల్. ఒకానొక టైం లో అతని స్నేహితుడు, అతనితో రెండు సినిమాలు నిర్మించిన నిర్మాత, ఇప్పటి ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని ఎన్టీఆర్ పడ్డ కష్టాల గురించి కామెంట్స్ చేశారు. కొడాలి నాని మాట్లాడుతూ.." ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్. అతని టాలెంట్ వల్లే ఈరోజు తాను స్టార్ హీరో అయ్యాడు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే నైపుణ్యం కలిగిన నటుడు ఎన్టీఆర్. మొదటి నుంచి అతన్ని ఫ్యామిలీ తక్కువ చేసి చూసేది. కనీసం అతన్ని కుటుంబంలో జరిగే శుభకార్యాలకి కూడా పిలిచేవారు కాదు. మొదట్లో అతని సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అతనికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ నిర్మాతలు ఇచ్చేవారు కాదు.

అంతేకాకుండా అతను సినిమా యూనిట్ తో కలిసి లైన్లో నిలబడి భోజనం చేసిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. హీరో అయినప్పటికీ తినేటప్పుడు ఎన్టీఆర్కి మొదట్లో కుర్చీ కూడా వెయ్యకుండా అవమానించిన వాళ్లు కూడా ఉన్నారు. ఇలా ఒక రకంగా కాదు పెద్ద కుటుంబానికి చెందిన హీరో అయినప్పటికీ అతను కొత్త నటుడు లాగానే అన్ని కష్టాలను అనుభవించాడు. ఆ కష్టాలతో వచ్చిన ఫలితమే ఇప్పుడు ఎన్టీఆర్ హోదా. ప్రెసెంట్ ఎన్టీఆర్ అంటేనే ఒక స్పెషల్ బ్రాండ్ కింద మారింది " అంటూ కామెంట్స్ చేశాడు కొడాలి నాని. ప్రజెంట్ ఈన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దెబ్బతిన్న సింహం తగ్గుతుంది అనుకోవడం వారి మూర్ఖత్వం. ప్రెసెంట్ తన కోపాన్ని రెట్టింపు చేసుకుని ఎదిగింది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: