ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది 'ఆహా తెలుగు ఇండియన్ ఐడల్'. తాజాగా మూడో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 7 నుంచి ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఆహాలో అలరించనుందని ప్రకటించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ 'గత రెండు సీజన్స్ కంటే మూడో సీజన్‌లో వరల్డ్ వైడ్ మ్యూజిక్ కంటెస్టెంట్స్ వచ్చారు. అందరిలో నుంచి 12 మంది టాప్ సింగర్స్‌ను సెలెక్ట్ చేశాం. నన్ను నమ్మి ఇండియన్ ఐడల్‌లో జడ్జిగా పెట్టిన అరవింద్‌గారికి, ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్' అని చెప్పాడు.హోస్ట్ శ్రీరామ్ చంద్ర మాట్లాడుతూ ''ఇండియన్ ఐడల్ 3 సీజన్‌లో మళ్లీ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. 2010 నుంచి ఇప్పటి దాకా ఈ ప్రోగ్రామ్‌తో చాలా ఎమోషన్స్ ఎటాచ్ అయ్యున్నాయి. ఈ సీజన్‌కు సంబంధించిన ఆడిషన్స్ జరిగినప్పుడు చాలా మంది కేవలం సింగర్స్ మాత్రమే కాదు.. చాలా మంది సంగీత కళకారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఇండియన్ ఐడల్ సీజన్ 3 గొప్ప టాలెంట్‌ను తీసుకురాబోతున్నారు. తొలి రెండు సీజన్స్‌ను మించిన టాలెంటెడ్ పర్సన్స్ వచ్చారు. మూడు నాలుగు నెలల పాటు ఈ మ్యూజికల్ జర్నీ కొనసాగనుంది. ఆహా నాకు కుటుంబంలాంటిది. మంచి అనుబంధం ఉంది. ఇండియన్ ఐడల్ జర్నీతో పాటు నటుడిగానూ ఆహాలో ప్రేక్షకులను పలకరించాను. ఇలాంటి గొప్ప మాధ్యమంలో ఇంకా కొత్త టాలెంట్ పరిచయం అవుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్‌'' అన్నారు.

సింగర్ గీతా మాధురి మాట్లాడుతూ ''ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 చేసిన తర్వాత సీజన్ 3కి కాల్ వస్తుందని నేను అనుకోలేదు. అయితే నాకు ఆహా నుంచి కాల్ వచ్చింది. సీజన్ 3కి చక్కగా ఆడిషన్స్ ముగిశాయి. మంచి కంటెస్టెంట్స్ వచ్చారు. గత సీజన్స్‌లాగా ఈ సీజన్‌లోనూ చాలా మంచి ఆణిముత్యాలు దొరికారు. వాళ్లు ఈ వేదిక ఎలా ఉపయోగించుకుని ప్రతిభను చాటుకుంటారో చూడాలి. ఇండియన్ ఐడల్ సీజన్ 3 చాలా చాలా బావుంటుంది'' అన్నారు.ఆహా నుంచి రాకేష్ మాట్లాడుతూ ''తెలుగు ఇండియన్ ఐడల్ రెండు సీజన్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో సీజన్ రానుంది. మేం ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీనికి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో యు.ఎస్‌లో ఆడిషన్స్ చేశాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సీజన్ గొప్పగా ఉంటుందని భావిస్తున్నాను'' అన్నారు.సింగర్ కార్తీక్ మాట్లాడుతూ ''ఇండియన్ ఐడల్ సీజన్ 3లో యంగ్ టాలెంటెడ్ సింగర్స్ మాత్రమే కాదు, ఏదో సాధించాలనే తపన ఉన్నవాళ్లు వచ్చారు. సింగర్స్ మాత్రమే కాదు, మ్యూజిషియన్స్ కూడా వచ్చారు. సీజన్ 3 చాలా మందిని ఇన్‌స్పైర్ చేస్తుంది'' అన్నారు.

ప్రీమాంటల్ ఇండియా ఆరాధన మాట్లాడుతూ ''తమన్, కార్తీక్, గీతామాధురి, శ్రీరామచంద్ర చాలా మందికి స్ఫూర్తినిస్తూ ఎంకరేజ్ చేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. సీజన్ 3లో మన తెలుగు రాష్ట్రాలతో పాటు యు.ఎస్ వరకు వెళ్లాం. గొప్ప టాలెంట్‌ను పరిచయం చేయబోతున్నాం. ప్రేక్షకులు సపోర్ట్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నాం'' అన్నారు.ఆహా సీఇఓ రవికాంత్ మాట్లాడుతూ ''ఇండియన్ ఐడల్ ఎంతో మంది గొప్ప సింగర్స్‌ను అందించింది. తమన్‌, కార్తీక్‌, గీతామాధురి, శ్రీరామచంద్ర వంటి వారు రాక్‌స్టార్స్ మెప్పిస్తున్నారు. ఈ సీజన్ 3లో కేవలం సింగింగ్ టాలెంట్‌తో పాటు కొత్త కొత్త మ్యూజికల్ టాలెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకబోతున్నారు'' అన్నారు.మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.తమన్ మాట్లాడుతూ ''గత రెండు సీజన్స్ కంటే ఇండియన్ ఐడల్ సీజన్ 3లో వరల్డ్ వైడ్ మ్యూజిక్ కంటెస్టెంట్స్ వచ్చారు. అందరిలో నుంచి 12 మంది టాప్ సింగర్స్‌ను ఎంపిక చేశాం. నన్ను నమ్మి ఇండియన్ ఐడల్ లో జడ్జిగా పెట్టిన అరవింద్‌గారికి, ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్‌గారికి ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. ప్రీమాంటల్ టీమ్‌కి థాంక్స్‌. నా మ్యూజిషియన్ టీమ్ ఫెంటాస్టిక్ సపోర్ట్ ఇచ్చారు. సీజన్ 3 నుంచి గొప్ప టాలెంట్ మన ముందుకు రాబోతుంది. ఇది మాకు ఓ ఎక్స్‌పీరియెన్స్ అనే చెప్పాలి. అందరికీ థాంక్స్‌. జూన్ 7 నుంచి ఆహాలో ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రారంభం కానుంది'' అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: