రెండు రోజుల క్రితం బెంగళూరు సిటీలో ఓ రేవ్ పార్టీ జరిగింది అని , అందులో తెలుగు సినీ ప్రముఖులు చాలా మంది పాల్గొన్నారు అని , ఓ వార్త బయటకు వచ్చింది. అందులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటి అయినటువంటి హేమా కూడా ఆ రేవ్ పార్టీలో ఉంది అని వార్త లు బయటకు వచ్చాయి. దానితో వెంటనే స్పందించిన ఆమె నేను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదు , హైదరాబాదు లోని ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను అని వీడియోను విడుదల చేసింది. దానితో తర్వాత బెంగళూరు పోలీసులు ఆమె రాత్రి బెంగళూరు లో జరిగిన రేవ్ పార్టీలో ఉంది. ఆమె ప్రస్తుతం మా కస్టడీ లోనే ఉంది.

ఆమె మా కస్టడీ లో ఉండగానే వీడియో తీసి పోస్ట్ చేసింది. అని బెంగళూరు పోలీసులు ఆమె ఫోటోను కూడా విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ విషయంపై సినీ నటి కరాటే కళ్యాణి స్పందించింది. కొంత కాలం క్రితం నేను పేకాట అడుతు దొరికిపోయాను అంటూ నన్ను అప్పట్లో హేమ బజారుకీడ్చింది. ఇక ఇప్పుడు ఆమె బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ లో డ్రగ్స్ తో పోలీసులకు దొరికిపోయింది. శాంపిల్స్ , రిజల్ట్ వచ్చాక పోలీసులు ఆమెకు శిక్ష వేస్తారు.

మా అసోసియేషన్ తరపున ఆమె మరిన్ని పనిష్మెంట్ లకు సిద్ధంగా ఉండాలి అని కళ్యాణి హేమ నీ హెచ్చరించింది. ఇలా తాజాగా హేమ బెంగళూరు.లో జరిగిన రేవ్ పార్టీ లో పోలీసులకు దొరకపోవడంపై కరాటే కళ్యాణి స్పందించింది. ఇక మా ఎలక్షన్ ల సందర్భంగా వీరిద్దరి మధ్య అనేక సందర్భా లలో మాటల యుద్ధం జరిగింది. ఇక తాజాగా కరేటి కళ్యాణి , హేమ గురించి స్పందిస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kk