కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మార్క్ ఆంటోనీ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి అజిత్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. లేఇకపోతే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ హీరోగా నటిస్తూ ఉండడం ,  మార్క్ ఆంటోనీ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ ఓ టీ టీ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళ్తే ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు ఈ సంస్థ ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఏకంగా 95 కోట్ల భారీ బడ్జెట్ తో దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమా విడుదల అయినా కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: