పుష్ప 2 మూవీ నుంచి సెకండ్ సింగిల్‌పై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. సెకండ్ సింగిల్ సంబంధించిన రిలీజ్ డేట్‌ను  అనౌన్స్‌చేయబోతున్నట్లు ప్రకటించారు.ఈ సెకండ్ సింగిల్‌లో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న కలిసి కనిపించబోతున్నట్లు హింట్ ఇచ్చారు.శ్రీవల్లితో తన సామీతో కలిసి కపుల్ సాంగ్ ద్వారా అభిమానులను మెస్మరైజ్ చేయడం ఖాయమని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. సెకండ్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి సూపర్ అని అర్థం వచ్చేలా రష్మిక చేతి వేళ్లను మాత్రమే చూపిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే మాస్ రొమాంటిక్ డ్యూయెట్‌గా ఈ సాంగ్ సాగనున్నట్లు తెలుస్తోంది.ఇటీవల విడుదలైన చేసిన బన్నీ స్పెషల్ గ్లింప్స్ చూస్తే ఈ ఏ రేంజ్‏లో ఉంటుందో అర్థమవుతుంది. అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, ఫస్ట్ సాంగ్, పోస్టర్స్ పుష్ప 2పై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. తాజాగా రెండో సాంగ్ ప్రోమో విడుదల చేసింది చిత్రయూనిట్. ఆ వీడియోలో సాంగ్ సెట్ లో రష్మిక మేకప్ వేసుకుంటుంటే.. కేశవా వచ్చి.. శ్రీవల్లి వదిన పుష్ప 2 నుంచి రెండో పాట రిలీజ్ చేస్తున్నారంట కదా..ఆ పాటేందో చెప్తావా అని అడగ్గా.. రష్మిక నడుస్తూ.. సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి.. అంటూ పాట పాడుతూ పుష్పరాజ్ సిగ్నెచర్ స్టెప్ వేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరలవుతుంది.

పుష్ప 2 నుంచి రెండో పాటను మే 29న 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్ బన్నీ, రష్మిక కపుల్ సాంగ్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ ను ఆగస్ట్ 15న గ్రాండ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ కోసం సౌత్ టూ నార్త్ అడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ లో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్, అనుసూయ, జగదీష్ కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ప్రస్తుతం పాన్ ఇండియా అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ల్లో పుష్ప 2 కూడా ఒకటి. గతంలో విడుదలైన పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు పుష్ప 2పై భారీ హైప్ ఉంది. ఈ తర్వాత బన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడు. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వర్క్ చేయనున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: