అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'పుష్ప-2 ది రూల్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇటివలే ఈ చిత్రం నుంచి విడుదలైన 'పుష్ప పుష్ప..' సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ చార్ట్ బస్టర్ నెంబర్ని సింగర్ దీపక్ బ్లూ పాడారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్ ట్రెండ్లో కొనసాగుతున్న నేపథ్యంలో సింగర్ దీపక్ బ్లూ మీడియాతో ముచ్చటించారు.''నా స్వస్థలం చెన్నై. మా నాన్నగారు కొంతకాలం రేపల్లెలో ఉన్నారు. అలా నాకు తెలుగు భాషపై అవగాహన ఉంది. మా అమ్మమ్మ, మా అమ్మగార్లకు సంగీతంలో ప్రావీణ్యం ఉంది. అలా సంగీతంపై నాకు ఆసక్తి కలిగింది. మైక్రోబయాలజీలో పీజీ చదివాను. కొంతకాలం ఉద్యోగం చేస్తూనే, సింగర్‌గా ఉన్నాను. ఆ తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి సింగర్‌గా బిజీ అయ్యా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు మూడొందలకు పైగా పాటలు పాడాను. విజయ్‌ ఆంటోనీగారి 'నాన్‌' సినిమాలో తొలి పాడాను. తేజగారి దర్శకత్వంలో వచ్చిన 'నీకు నాకు డాష్‌ డాష్‌' చిత్రంలో 'బాయ్‌ బాయ్‌' పాడాను. తెలుగులో అదే నా తొలి పాట. ఆ తర్వాత 'బీరువా, పండగ చేస్కో, కిక్‌ 2, చుట్టాలబ్బాయి, డిక్టేటర్, ఇటీవల 'వారసుడు' చిత్రాల్లో పాటలు పాడాను. కానీ ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో..' చిత్రంలోని 'లవ్‌ దెబ్బ', రామ్‌చరణ్‌ 'బ్రూస్‌లీ'లోని 'మెగా మీటర్‌' పాటలు గుర్తింపు తీసుకువచ్చాయి. ఇక 'పుష్ప'లోని 'హే బిడ్డ..' పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ చిన్న వాయిస్‌ ఇచ్చాను. ఇప్పుడు 'పుష్ప: ది రూల్‌' సినిమా టైటిల్‌ సాంగ్‌ 'పుష్ప పుష్ప' పాడటం హ్యాపీగా ఉంది. ఈ పాట నా కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా భావిస్తున్నాను. నాకు చాలా మంది సింగర్స్‌ స్ఫూర్తి. ఎస్పీబీగారు ప్రేరణ'' అన్నారు. ఇంకా మాట్లాడుతూ- ''నా పేరు దీపక్‌. కానీ దీపక్‌ పేరుతో చాలామంది సింగర్స్‌ ఉన్నారు. నా ఫేవరెట్‌ కలర్‌ బ్లూ. అలా నా పేరుకి బ్లూ చేర్చుకున్నాను'' అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: