తెలుగు ఇండస్ట్రీలోకి 'ఉయ్యాల జంపాల' మూవీతో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ పాత్రతో ఎంట్రీ ఇచ్చింది పునర్నవి భూపాలం. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రల్లో నటించి మెప్పించింది.ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఒక పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతున్నాయి..2019 లో తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో ' బిగ్ బాస్' తనదైన పర్ఫామెన్స్, గెమ్స్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పునర్నవికి పలు అవకాశాలు వచ్చినా ఓ సీరీస్ లో నటించి, పలు టీవి షోస్ లో కనిపించి పై చదువులు చదవడానికి లండన్ వెళ్లిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పునర్నవి తనకు సంబంధించిన ప్రతి అప్ డేట్ తన ఫ్యాన్స్ కి షేర్ చేస్తుంది. తాజాగా పునర్నవి సోషల్ మాధ్యమంలో ఓ పోస్ట్ షేర్ చేసింది.వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో ఎన్నో క్యారెక్టర్ పాత్రల్లో తనదైన పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి పునర్నవి భూపాలం తర్వాత బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ లో సింగర్ రాహూల్ సిప్లిగంజ్ తో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వీరిద్దరూ కొంతకాలం రిలేషన్ లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అదంతా అవాస్తవం..తాము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని కొట్టిపడేశారు. తాజాగా పునర్నవి తన సోషల్ మాధ్యమంలో అబ్బాయితో దిగిన ఫోలో పోస్ట్ చేసి స్పెషల్ గా బర్త్ డె విషెస్ చెప్పింది. అమెరికాలో హవాసుపై ఇండియన్ రిజర్ేవషన్ అనే విజింట్ ప్రదేశం వద్ద ఉన్న కొండల్లో ఓ అబ్బాయితో ఈ అమ్మడు ఫోటో దిగింది.

పునర్నవి పోస్ట్ చేసిన ఫోటో వాళ్లు వెనక్కి తిరిగి కూర్చున్నది కావడంతో ముఖాలు కనిపించడం లేదు. కాకపోతే ఆ అబ్బాయిని హత్తుకొని, భుజంపై చేయి వేసింది ఈ అమ్మడు. ఈ ఫోటో షేర్ చేస్తూ 'నా ఒక్కగానొక్క లవ్ కి హ్యాపీ బర్త్ డే' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హ్యాపీ బర్త డే ల్ అని చెప్పడంతో పాటు మీద చేయి వేసి చాలా క్లోజ్ గా ఉండటంతో ఆ అబ్బాయి పునర్నవి బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు.మరి ఇంతకీ ఈ ఫోటో వెనుక ఉన్న అంతరార్థం ఏంటో తెలియదు.. అతను నిజంగా బాయ్ ఫ్రెండా? కాదా అన్న విషయం తెలియాల్సి క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: