దివంగత నటుడు సుశాంత్ సిద్ధూ రాజ్ పుత్ హీరో గా మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియార అద్వానీ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల క్రితం ఏం ఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ధోని జీవిత కథ ఆధారంగా రూపొందడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆ సమయం లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

సినిమా సూపర్ సక్సెస్ కావడంతో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ కి మంచి ఇమేజ్ ఈ మూవీ ద్వారా వచ్చింది. అలాగే కియార అద్వాని కి ఈ సినిమా కంటే ముందు హిందీ సినీ పరిశ్రమలో పెద్దగా గుర్తింపు లేదు. ఎప్పుడు అయితే ఈ సినిమా మంచి విజయం సాధించిందో ఈ మూవీ తో ఆమెకు కూడా హిందీ సినీ పరిశ్రమ తో పాటు ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.

ఆ సమయంలో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాని జూలై 7 వ తేదీన ధోని బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ నిర్ణయించారు. ఇక ఈ సినిమాను కేవలం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లో మాత్రమే రీ రిలీజ్ చేయనున్నారు.

ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అయిన చాలా సినిమాలకు మంచి కలెక్షన్ లు వచ్చాయి. మరి రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Msd