డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. గత ఎడాది నుండి ఇదిగో ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు అప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని చెప్పడమే కానీ ఇప్పటివరకు పెళ్లి పై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు ప్రభాస్. అయితే ఈ మధ్యే ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నాడు అంటూ ఒక పోస్ట్ విడుదల చేశాడు. ఇక ఆ పోస్ట్ పెళ్లి గురించేనా అని అందరూ అనుకున్నారు. తాజాగా ఇప్పుడు ఆ విషయంపై నోరు విప్పాడు ప్రభాస్. తాజాగా కల్కి సినిమా స్పెషల్ ఈవెంట్ రామోజీ ఫిలిం

 సిటీ లో జరిగిన సంగతి తెలిసిందే.  అయితే ఇందులో తమ సినిమాలోని బుజ్జి అనే ఒక స్పెషల్ వెహికిల్ ను పరిచయం చేసారు చిత్రబంధం. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ ను రకరకాల ప్రశ్నలు అడిగింది సుమ. ఇందులో భాగంగానే సుమ మాట్లాడుతూ.. అప్పట్లో స్పెషల్ వ్యక్తి వస్తుంది అనగానే ఎంతమంది అమ్మాయిలు గుండెలు పగిలిపోయాయో తెలుసా అని ప్రభాస్ ని అడిగింది.. దానికి వెంటనే ప్రభాస్ స్పందిస్తూ.. ఆ అమ్మాయి ల కోసమే నేను ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్నాను అని చెప్పాడు. దీంతో ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ

 కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ప్రభాస్ మాట్లాడుతూ..  మా డైరెక్టర్ ఐడియాలు ఇవన్నీ ఇక్కడికి హాయ్ డార్లింగ్ అని చెప్పి వెళదాము అని అనుకున్నాం.. తీరా వస్తే మా డైరెక్టర్ మాకు తెలియని ఏవేవో పనులు చేస్తున్నాడు.. మూడేళ్ల పాటు నాకు ఈ బుజ్జిని తగిలించాడు.. అంటూ సరదాగా నవ్వుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి.నుండి ఆ వాహనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.  ఇప్పుడు బుజ్జిని విడుదల చేసి అందరికీ ఊరట కలిగించారు. కాగా కల్కి టీం మొదటిసారి చేసిన ఈ ప్రమోషన్ ఈవెంట్ కోసం ప్రభాస్ అభిమానులు తరలివచ్చారు. ఇకపోతే కల్కి టీం తాజాగా విడుదల చేసిన భైరవ బుజ్జి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: