తమిళ స్టార్ హీరో  దళపతి విజయ్, మీనాక్షి చౌదరి కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలై పోస్టర్స్, సాంగ్ భారీ హైప్‌ను క్రియేట్ చేస్తాయని అనుకున్నారు. కానీ ఒక్క తమిళనాడులో తప్ప ఎక్కడ కూడా ఈ సినిమాని పట్టించుకునే నాథుడే లేడు. దానికి కారణం రీసెంట్ గా రిలీజ్ అయిన విజయ్ సినిమాలు ప్లాప్ అవ్వడం. ఇంకా ఇటీవల రిలీజ్ అయిన సాంగ్ కూడా పూర్ రెస్పాన్స్ దక్కించుకుంది. విజయ్ సాంగ్ రిలీజ్ అయిందంటే చాలు వారంలోపే యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ఇంకా 2 మిలియన్ లైక్స్ రావడం పక్కా.. కానీ ఈ విజిల్ పాట మాత్రం నెల దాటినా కూడా కనీసం 60 మిలియన్స్ వ్యూస్ కూడా దాటలేదు. పైగా ఈ సినిమా లో విజయ్ లుక్స్ కూడా అంతగా బాగాలేదు. ఈమధ్య విజయ్ లుక్స్ పై ఘోరమైన ట్రోలింగ్ జరిగింది. మీసాలు లేకుండా క్లీన్ షేవ్ లో విజయ్ అస్సలు బాగోలేడంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ తండ్రి కొడుకుల గెటప్ లో డబుల్ రోల్ చేస్తున్నాడని నటుడు వైభవ్ చెప్పాడు.


అందుకే కొడుకు పాత్ర కోసం విజయ్ క్లీన్ షేవ్ లుక్ మైంటైన్ చేస్తున్నాడట.ప్రస్తుతం ది గోట్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి.ఇదిలా ఉంటే.. తాజాగా, ది గోట్ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ. 110 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అంతేగాక విజయ్ కి పోటీ ఇచ్చే అజిత్ గుడ్ బాడ్ అగ్లీ సినిమాని కూడా నెట్ ఫ్లిక్స్ ఏకంగా 95 కోట్లకు కొన్నదని సమాచారం. ఇక గోట్ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో చాలా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బీస్ట్, వారిసు, లియో సినిమాలతో మూడు ప్లాపులు వరుసగా అందుకున్న విజయ్ ఈ సినిమాతో హిట్టు కొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ ఈ సినిమాకి అనుకున్నంత బజ్ అయితే రావడం లేదు.అందుకే విజయ్ జూన్ 1 న స్టూడెంట్స్ తో గ్రాండ్ మీట్ ఏర్పాటు చెయ్యడానికి రెడీ అవుతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: