దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ తాజాగా లవ్ మీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మే 25 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ రోజు ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వేడుకను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి దిల్ రాజు కూడా విచ్చేశారు. లవ్ మీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

దిల్ రాజు "లవ్ మీ" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ ... టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటు వంటి అల్లు అర్జున్ ను నేను చాలా సంవత్సరాలుగా , చాలా దగ్గర నుండి చూశాను. ఆయన ఒక్కో సినిమాకు ఎంతలా కష్ట పడతారు అనే విషయం నాకు తెలుసు. ఆయన ఒక సినిమాను ఓకే చేసినప్పటి నుండి ఆ సినిమా పూర్తి అయ్యే వరకు దాని పైనే ధ్యాస పెడుతూ ఉంటాడు. ఆ సినిమా కోసం ఎలాంటి లుక్ లోకి రావాలి , ఎంత కష్ట పడాలి అనేదే అతని మైండ్ లో ఉంటుంది.

సినిమా కోసం 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు. అందుకే ఆయన ప్రస్తుతం ఎంతో గొప్ప స్థానంలో ఉన్నాడు. నువ్వు కూడా అంతలా కష్టపడాలి. ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కాదు , ఇచ్చిన దానిపై నిలబడాలి. 24 గంటలు సినిమా గురించే ఆలోచించాలి. ఒక సినిమా స్క్రిప్టు ను ఓకే చేసుకున్నాము అంటే అది సినిమాగా రూపొంది , విడుదల అయ్యే వరకు దాని కోసం కష్ట పడాలి. అలా కష్ట పడిన రోజు మంచి స్థాయికి వస్తావు అని అల్లు అర్జున్ ను ఉదాహరణగా తీసుకొని ఆశిష్ ఎలా ఉండాలో అనే విషయాన్ని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dr