తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన దొరసాని అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఆనంద్ తన నటనతో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఈయన మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో నటించాడు.

మూవీ నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ నటుడు కొంత కాలం క్రితం బేబీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ తో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు గం గం గణేశా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ నటుడు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా కూడా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ఇక తాజా ఇంటర్వ్యూ లో ఆనంద్ మాట్లాడుతూ ... నా దగ్గరికి స్టార్ డైరెక్టర్ లు ఎవరు పెద్దగా రావడం లేదు. వంద మంది డైరెక్టర్ లు నాకు కథ చెప్పడానికి వస్తే అందులో దాదాపు 50 మంది కొత్త వాళ్లే ఉంటున్నారు.

ఇక ఈ మధ్య కాలంలో 25 నుండి 30 మంది తమిళ దర్శకులు నాకు కథ చెప్పారు అని ఈ యువ నటుడు చెప్పాడు. ఇకపోతే గం గం గణేశా ట్రైలర్ రీసెంట్ గా విడుదల కాగా దీనికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ మూవీ తో ఈ యువ నటుడు ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ad