తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పెంచిన సినిమాలలో ఆర్ ఆర్ ఆర్ ప్రథమ స్థానంలో ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఈ గ్రేట్ మూవీ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ మూవీ లో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటించగా , ఎన్టీఆర్ కి జోడి గా ఓలీవియా మోరిస్ నటించింది.

మూవీ అత్యంత భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి 1200 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కలెక్షన్ ల విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ మూవీ కి ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.  సినిమాల విషయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు కూడా ఈ సినిమాకు దక్కింది. ఇక ఈ సినిమాను ఎంతో మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ , నటీ నటులు పొగిడిన విషయం మన అందరికీ తెలిసిందే.

సినిమా విడుదల అయిన చాలా రోజుల తర్వాత మరో హాలీవుడ్ నటి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. అసలు విషయం లోకి వెళితే ... క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఇంటర్ స్టెల్లార్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన అనే హతవే ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకి కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా అందరిలానే ఎంతో బాగా నచ్చింది అని , అది సూపర్ మరియు అమేజింగ్ అని అలాగే ఆ సినిమాలో ఎవరితోనైనా నటించేందుకు సిద్ధంగా ఉన్నాను అని ఆమె తాజాగా  తెలిపింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr