టాలీవుడ్ అలనాటి తార లయకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చిత్ర పరిశ్రమకు గ్యాప్ ఇచ్చి చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు రావడానికి సిద్ధంగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన అభిమానులతో చాలా విషయాలను షేర్ చేసుకుంది. అంతేకాకుండా తాను ఎదుర్కొన్న సమస్యలు అవమానాల గురించి ఓపెన్ గా చెప్పేసింది. ఈ తరుణంలోనే తనపై వచ్చిన రూమర్ గురించి చెబుతూ లయ ఎమోషనల్ అయింది.

అసలు విషయాల్లోకి వెళితే.. స్వయం వరం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అదేవిధంగా మంచి పాపులారిటీ ఉన్న సమయంలోనే ఎన్నారై ని వివాహం చేసుకొని చిత్ర పరిశ్రమకు గుడ్ బాయ్ చెప్పి అమెరికా వెళ్ళిపోయింది. ఇక ఆ తరువాత లయకు సంబంధించిన అనేక పుకార్లు, షికారు చేశాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ లయ భర్త ఆస్తులన్నీ పోయి లయ ప్రస్తుతం అమెరికాలో టీ అమ్ముకుంటుందని ఒక రూమర్ చెక్కర్లు కొట్టింది. అయితే దీనిపై లయ మాట్లాడుతూ.. " ఈ వార్త మా ఫ్యామిలీని చాలా బాధ పెట్టింది.


ఇండస్ట్రీకి దూరమైతే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారా? అసలు అందులో ఎలాంటి నిజం లేదు. నేను నా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకున్నాను అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యాను " అంటూ వెల్లడించింది ఈ బ్యూటీ. ప్రజెంట్ లయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె వ్యాఖ్యలను  చూసిన పలువురు.. ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోతే ఇటువంటి రూమర్సే వస్తాయి మరి. సినీ ఇండస్ట్రీ ని వదిలేద్దాం అనుకున్నప్పుడు ప్రేక్షకులకి సరైన అవగాహన కలిగించి వదిలేయాలి. అంతేకానీ చెప్పా పెట్టకుండా సినీ ఇండస్ట్రీని వదిలేస్తే ఇటువంటి రూమర్స్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: