తమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ బిచ్చగాడు మూవీ తో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే బిచ్చగాడు మూవీ లో విజయ్ ఆంటోనీ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకుడుగా , సంగీత దర్శకుడుగా , నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

మూవీ మొదట తమిళ్ లో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఈయనకు మంచి గుర్తింపు కూడా లభించింది. ఇలా తమిళ సినీ పరిశ్రమలో ఈ సినిమా ముందు విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఈ సినిమాను తెలుగు లో డబ్ చేయకుండా ఒక హీరోతో రీమేక్ చేయాలి అని విజయ్ భావించాడట. అందులో భాగంగా ఓ హీరోతో సంప్రదింపులు కూడా జరిపాడట.

కానీ అవి ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత బిచ్చగాడు మూవీ ని తెలుగు లో డబ్ చేసి విడుదల చేశాడు. అసలు విజయ్ ఏ హీరోతో ఈ సినిమాని రీమేక్ చేయాలి అనుకున్నాడో తెలుసా..? అతను మరెవరో కాదు రానా. బిచ్చగాడు మూవీ మొదట తమిళ్ లో విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఈ సినిమాను రానా తో తెలుగు లో రీమిక్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో విజయ్ , రానా ను కలిసి స్క్రిప్ట్ డిస్కషన్ కూడా చేశాడట.

కానీ రానామూవీ రీమేక్ లో నటించడానికి అంత ఆసక్తి చూపించకపోవడంతో విజయ్ తమిళ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న బిచ్చగాడు మూవీ ని రెండు నెలల తర్వాత తెలుగు లో డబ్ చేసి విడుదల చేశాడు. ఇక ఈ సినిమా తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: