మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించి అందుకు అనుగుణంగా ఈ సినిమా ప్రమోషన్ లను కూడా చేస్తూ వచ్చింది.

కానీ చివరి నిమిషం వచ్చే సరికి ఈ మూవీ ని మే 31 వ తేదీన కాకుండా జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాకపోతే మే 31 వ తేదీన ఈ సినిమా విడుదల అని ప్రకటించిన సమయం లోనే ఈ సినిమా యొక్క ట్రైలర్ ను మే 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆ ట్రైలర్ విడుదలలో భాగంగా ఓ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు దానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రానున్నట్లు మూవీ బృందం ప్రకటించింది. అన్నట్లుగానే ఈ మూవీ యూనిటీ నిన్న ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేసింది.

ఈ ట్రైలర్ ఈవెంట్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇక బాలకృష్ణ ముఖ్య అతిథిగా రావడంతో కాజల్ , బాలకృష్ణ గురించి చాలా గొప్ప విషయాలను చెప్పుకొచ్చింది. తాజాగా కాజల్ , బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ... బాలకృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి. అడగగానే మా ఫంక్షన్ కి వచ్చారు.

అది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇక బాలకృష్ణ గారికి ఏ మాత్రం క్యాలిక్యులేషన్స్ ఉండవు ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. ఆయన మనసుకు దగ్గర అయిన వ్యక్తుల కోసం ఏమైనా చేస్తారు. ఆయనతో భగవంత్ కేసరి సినిమా చేశాను. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చినందుకు ధన్యవాదాలు అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: