అనేకమంది హీరో మరియు హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేరు. వారిలో స్టార్ హీరోలా కూతుర్లు మరియు కొడుకులు కూడా ఉన్నారు. వారి తండ్రి ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి ఆయన వారికి సరైన నటన లేకపోతే ఇండస్ట్రీలో వారికి పెద్దగా గుర్తింపు దక్కదు. అలా ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలా పిల్లలు పెద్దగా అవకాశాలు లేక ఇండస్ట్రీని సైతం వదిలారు. ఇక ఇప్పుడు మాట్లాడుకోబోయే బ్యూటీ ఇండస్ట్రీకి చాలా కాలం గ్యాప్ ఇచ్చింది.

ఆమె మంచు లక్ష్మి. మంచు మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదట్లో యాంకర్ గా యాక్టర్ గా రాణించింది. కానీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో ఇంగ్లీషులో పలు సినిమాలను చేసింది. ఇక అక్కడ ఊపందుకుంటుంది అనే సమయంలో హాయ్ ఇండస్ట్రీని కూడా వదిలేసి మళ్లీ టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ప్రెసెంట్ ఓ వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇస్తుంది ఈ బ్యూటీ. ఇక మంచు లక్ష్మి బ్రదర్ విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప సినిమాపై ఇప్పటికే భారీ హైప్స్ ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా మంచు లక్ష్మి ప్రమోషన్స్ లో పాల్గొండగా.. అక్కడ ఆమెకి ఓ ప్రశ్న ఎదురైంది. మీ బ్రదర్ మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప సినిమా లో బాలీవుడ్ నుంచి ప్రతి ఇండస్ట్రీ నుంచి కొంతమంది నటిస్తున్నారు? మీరు కూడా ఆ సినిమాలో ఏమైనా యాడ్ చేస్తున్నారా? అని అక్కడ జర్నలిస్ట్ ప్రశ్నించగా.." నేను నిజంగా ఇది జోక్ గా చెబుతున్నా. నేను మా ఇంట్లో వాళ్ళతో అస్సలు నటించను. ఎందుకంటే నేను చేస్తే వారు కనిపించరు కదా? అలా ప్రతి సినిమాకి మా ఇంట్లో వాళ్లకి అవకాశాలు ఇస్తే అది ఫ్యామిలీ సినిమా అయిపోతుంది. మనోజ్ కూడా ఆ సినిమాలో లేడు " అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ప్రజెంట్ మంచు లక్ష్మి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: