తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తెలుగు లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ మూవీ మొదలు ఈమెకు వరుస సినిమా అవకాశాలు రావడం , అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ కావడంతో చాలా సంవత్సరాల పాటు ఈమె తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.

ఇకపోతే ఆఖరుగా ఈ బ్యూటీ తెలుగు లో కొండ పొలం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తర్వాత ఏ తెలుగు సినిమాలో కూడా ఈమె నటించలేదు. ఇది ఇలా ఉంటే ఈమె కొంత కాలం క్రితం నిర్మాత మరియు నటుడు అయినటువంటి జాకీ భాగ్నానిని పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు అనేక సినిమాలలో తన హాట్ స్కిన్ షో తో ప్రేక్షకులను రెచ్చగొట్టడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఇక ఈమె పెళ్లి తర్వాత ఈ స్థాయిలో స్కిన్ షో చేయదు అని చాలా మంది భావించారు.

కానీ ఈమె మాత్రం స్కిన్ షో విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఈమె సినిమాలలో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో తన అందాలను ఓలకపోస్తుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వాటి ద్వారా ఈ ముద్దు గుమ్మ కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతుంది. ఈమె తాజాగా కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన "ఇండియన్ 2" మూవీ లో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా జూలై 12 వ తేదీన విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: