అనేక తెలుగు , తమిళ , కన్నడ భాషలలో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కస్తూరి ఒకరు. చాలా సంవత్సరాల క్రితం ఈమె తెలుగులో కూడా అనేక సినిమాలలో నటించింది. వాటి ద్వారా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా నటిగా ఈమె మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో కస్తూరి తెలుగు సీరియల్స్ లో , సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ వస్తుంది. సీరియల్స్ , సినిమాలతో బిజీగానే కెరీర్ ను కొనసాగిస్తున్న ఈమె అప్పుడప్పుడు అనేక విషయాలలో తనదైన రీతిలో స్పందిస్తూ వార్తలు నిలుస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీ ఎల్ 2024) జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో మొదటి 8 మ్యాచ్ లలో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి , ఆ తర్వాత ఆరు మ్యాచులలో ఆరింటిలో గెలుపొంది ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించి ఈమె ఒక పోస్ట్ చేసింది అది వైరల్ అవుతుంది. ఇక బెంగళూరు ప్లే ఆప్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడింది. అందులో ఈ జట్టు ఓడిపోయింది. దానితో ఈ జట్టు ఈ సీజన్ నుండి వైదొలగింది.  

దానితో కస్తూరి తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అసలు కస్తూరి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో  బెంగళూరు దండు (బెంగళూరు కంటోన్మెంట్) రైల్వే స్టేషన్‌లోని నేమ్ బోర్డు ఫోటోను షేర్ చేసింది. దానిలో బెంగళూరు కంటోన్మెంట్ అంటే ఇంగ్లిష్ లో బెంగళూరు కంట్ అని అర్థం వచ్చేలా ఉంది.  బెంగుళూరు వల్ల కాదు అనే అర్థం వచ్చేలా ఆ ఫోటోను షేర్ చేసింది. తాజాగా ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: