కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సిద్ధార్థ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన అనగనగా ధీరుడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ లో ఈమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దానితో ఈమెకు ఈ సినిమా తర్వాత అనేక తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఈమె ఇప్పటికే చాలా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే కొన్ని టీవీ షో లకు , ఓ టీ టీ షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇక ప్రస్తుతం కూడా ఈమె పలు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

అందులో భాగంగా ఈమె తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తూ చాలా బాధపడింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ... తనను కొందరు ట్రోల్ చేయడం చూసి చాలా బాధేసేది అని చెప్పింది. అలాగే నాది మొదటి నుండి కూడా ముక్కు సూటిగా మాట్లాడే స్వభావం. అది కొందరికి నచ్చుతుంది. కొందరికి నచ్చదు. నచ్చని వారిలో కొందరు నన్ను ట్రోల్స్ చేస్తారు. కానీ చాలా మంది నన్ను అభిమానిస్తారు అని చెప్పింది.

అలాగే నా కెరియర్ , నా కుమార్తె భవిష్యత్తు కోసమే ప్రస్తుతం ముంబై లో ఉంటున్నట్లు ఈమె పేర్కొంది. ఇకపోతే తాజాగా మంచు లక్ష్మి "యక్షిణి" అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ మరికొన్ని రోజుల్లోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ తో మంచు లక్ష్మి ఎలాంటి క్రేజ్ ను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: