పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగ్  అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 27 న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ గ్లిమ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా ఇందులో భైరవ అనే పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఆయనకి జోడిగా దీపిక పదుకొనే నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో

 ముఖ్యపాత్రలో కనిపించబోతున్న బుజ్జి అనే ఒక రోబోట్ ను పరిచయం చేశారు చిత్రబృందం. ఇక ఆ రోబోట్ ఒక కార్.  ఈ సినిమా కోసం ఆ కారును స్పెషల్ గా డిజైన్ చేయించారు. తాజాగా ఆ బుజ్జి ని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ ఈవెంట్ సైతం నిర్వహించారు మేకర్స్. రామోజీ ఫిలిం సిటీ లో భారీగా ఆ ఈవెంట్ను నిర్వహించారు .అందుకుగాను 50 వేలకు పైగానే ప్రభాస్ అభిమానులు ఈవెంట్ కి తరలివచ్చారు. అందులో భాగంగానే ప్రభాస్ బుజ్జి లో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా అక్కడున్న వారందరూ బుజ్జిని చూసి షాక్ అయ్యారు. అయితే కల్కి కోసం దీన్ని తయారు చేయించడంతో బుజ్జి చాలా వెరైటీగా ఉంది. సాధారణమైన కార్ల కంటే చాలా డిఫరెంట్ గా ఉంది.

  తాజాగా ఇప్పుడు ఆ కారుని అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నడిపారు. దానికి సంబంధించిన వీడియోను కల్కి మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంజనీరింగ్ లో ఉన్న రూల్స్ అన్ని బ్రేక్ చేస్తూ దీనిని తయారు చేశారా అని చాలా ఫన్నీగా కామెంట్స్ సైతం చేశాడు నాగచైతన్య. ఇకపోతే నాగచైతన్యకి కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆయన దగ్గర కార్లల్లో అన్ని మోడల్స్ చాలా కాస్ట్ ఉన్నాయి అని చెప్పాలి. తాజాగా మరో  లగ్జరీ కారు కూడా కొన్నాడు. ఇక ప్రభాస్ కల్కి విషయానికి వస్తే.. ఇందులో ప్రభాస్ దీపికా పదుకొనే లతో.పాటు దిశా పటాని సైతం మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. అలాగే లోక నాయకుడు కమలహాసన్ బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కీలక పాత్రలో నటించినున్నారు. కాగా హాలీవుడ్ రేంజ్ లో దాదాపుగా 700 కోట్లకు పైగానే భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఎటువంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: